AIIMS Delhi: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఫొటోలు ఇవిగో!

Fire accident in Delhi AIIMS
  • ఎండోస్కోపీ గదిలో చెలరేగిన మంటలు
  • తీవ్ర ఆందోళనకు గురైన ఆసుపత్రి సిబ్బంది
  • రోగులను సుక్షితంగా తరలించిన సిబ్బంది
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. పాత ఓపీడీ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగాయి. ఆ గది కింది అంతస్తులోనే ఎమర్జెన్సీ వార్డు ఉంది. దీంతో ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎండోస్కోపీ గదిలోని రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి వచ్చాయని ఫైర్ సర్వీసెస్ అధికారులు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 
AIIMS Delhi
Fire Accident

More Telugu News