Kodali Nani: చంద్రబాబుకు మద్దతిస్తే బట్టలూడదీసి రోడ్డుపై నిలబెడతాం: పవన్ కు కొడాలి నాని హెచ్చరిక

Kodali Nani warns Janasena chief Pawan kalyan
  • చంద్రబాబు మద్దతుదారులతో కలిసి దాడి చేస్తే ఊరుకోమని పవన్‌కు హెచ్చరిక
  • ఎన్టీఆర్‌కు పట్టిన గతే నీకు పడుతుందని పవన్‌కు సూచన
  • 14 ఏళ్ళు అధికారంలో ఉండి చంద్రబాబు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని ప్రశ్న
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి మద్దతుదారులతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే వారిని ఆయన కంటే ఎక్కువగా బట్టలు ఊడతీసి రోడ్డుపై నిలబెడతామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేతను నమ్ముకుంటే జనసేనానికి ఎన్టీఆర్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. ఆయన రక్తంలోనే వెన్నుపోటు ఉందని తెలుసుకోవాలని సూచించారు. టీడీపీ స్క్రిప్ట్‌ను అమలు చేస్తే దీటుగా ఎదుర్కొంటామన్నారు. దొంగలను, 420లను పవన్ పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

పవన్ కల్యాణ్‌కు ఈ విషయం చెబుదామని పలుమార్లు ప్రయత్నించానని, కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింటుమెంట్ దొరకలేదన్నారు. పవన్‌ను చంద్రబాబు వాడుకొని వెన్నుపోటు పొడవడం ఖాయమన్నారు. అవసరానికి ఉపయోగించుకొని పక్కన పెట్టడమే చంద్రబాబుకు తెలుసునని చెప్పారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని టీడీపీలోకి వచ్చి, ఆ తర్వాత ఆయనకే వెన్నుపోటు పొడిచారన్నారు.

తనకు అధికారం ఇస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, మరి 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీశారు. నలభై ఏళ్లు టీడీపీ, కాంగ్రెస్‌లో అధికారం అనుభవించి ఇప్పుడు సొల్లు కబుర్లు చెబుతున్నారన్నారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులను కట్టారన్నారు. దేవినేని ఉమ వంటి బ్రోకర్లు ప్రాజెక్టులు ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, కేంద్రం కట్టాలని, కానీ చంద్రబాబు ఎందుకు చేతిలోకి తీసుకున్నాడని నిలదీశారు. ఆయనకు డెబ్బై ఏళ్లు దాటాయని, మైండ్ పని చేయడం లేదని విమర్శించారు.
Kodali Nani
Chandrababu
Pawan Kalyan
Janasena

More Telugu News