Tilak Varma: తిలక్ తొలి హాఫ్ సెంచరీ రోహిత్ కూతురికి అంకితం

Tilak Varma dedicates his maiden T20I fifty celebration to Rohit Sharmas daughter Samaira
  • వెస్టిండీస్ తో రెండో టీ20లో 51 పరుగులు చేసిన తిలక్ వర్మ
  • టీ20ల్లో అతడికి ఇదే తొలి అర్ధ సెంచరీ
  • హామీ ప్రకారం రోహిత్ కుమార్తె సమైరాకి అంకితం ఇస్తున్నట్టు ప్రకటన
తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ ఓ చిన్న పనితో నలుగురికీ ఆదర్శవంతంగా నిలిచాడు. వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లో 41 బంతుల్లో వర్మ 51 పరుగులు సాధించాడు. భారత జట్టులో టాప్ స్కోరర్ వర్మ ఒక్కడే. తెలుగు తేజం మెరిసినప్పటికీ.. వెస్టిండీస్ వైపు నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్ తో రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ కు ఓటమి తప్పలేదు.

అయితే ఈ మ్యాచ్ రూపంలో తిలక్ వర్మ తన తొలి టీ20 అర్ధసెంచరీని నమోదు చేశాడు. దీన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు. సమైరాతో తనకు మంచి అనుబంధం ఉన్నట్టు మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో వర్మ వెల్లడించాడు. తొలి అర్ధ సెంచరీ లేదా సెంచరీని సాధించినప్పుడు సంబరపడేలా చేస్తానని తాను సమైరాకి చెప్పినట్టు పేర్కొన్నాడు. తిలక్ వర్మ ఐపీఎల్ లోనూ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ లో భాగంగా ఉండడం తెలిసిందే.
Tilak Varma
maiden
hlaf century
dedicated
Rohit Sharmas
daughter

More Telugu News