Imaginary Cricket: రోడ్డుపై గాల్లోనే క్రికెట్ ఆడిన వృద్ధుడు.. ఎమోషనల్ వీడియో ఇదిగో!

Video Of Old Man Playing Imaginary Cricket Is Viral
  • బౌలర్ వేసిన బంతిని ఫ్రంట్‌పుట్‌కు వచ్చి మరీ సిక్స్ బాదినట్టు అభినయించిన వృద్ధుడు 
  • సోషల్ మీడియాలో హోరెత్తుతున్న కామెంట్లు
  • అతడు నిపుణుడు అయే ఉంటాడని అనుమానం
ఓ వృద్ధుడు రోడ్డుపై గాల్లోనే క్రికెట్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. రోడ్డు పక్కన బ్యాటింగ్ చేస్తున్న పొజిషన్‌లో నిల్చున్న వృద్ధుడు బౌలర్ బంతి వేస్తున్నట్టు ఊహించుకుని ఫ్రంట్‌పుట్‌కు వచ్చి బలంగా బాదాడు. అంతే బంతి గాల్లోకి లేచి స్టాండ్స్‌లోకి దూసుకెళ్లినట్టు ఊహించుకుంటూ సంతోషంగా ముందుకు కదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దున్నేస్తోంది. అయితే, ఇది ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.

ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. క్రికెట్‌పై ఆ వృద్ధుడికి ఉన్న పాషన్‌కు అది నిదర్శనమని చెబుతున్నారు. అంతేకాదు, అతడి స్టాండింగ్ పొజిషన్, ఫ్రంట్‌పుట్‌కు వచ్చిన తీరు, ఆపై ముందుకు వచ్చి ప్రేక్షకుల వైపు తిరిగి అభివాదం చేయడం చూస్తుంటే క్రికెట్‌లో అతడు నిపుణుడే అయి ఉంటాడని కూడా చెబుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి!
Imaginary Cricket
Cricket
Viral Videos

More Telugu News