కాఫీలో రోజూ కొంచెం చొప్పున భర్తకు విషం.. తర్వాత ఏమైందంటే..!
- భర్త మరణిస్తే వచ్చే పరిహారంపై ఆశ
- కాఫీలో రోజూ కొంచెం బ్లీచ్ కలిపి ఇస్తున్న వైనం
- రహస్య కెమెరాల ద్వారా గుర్తించిన భర్త
అసలు రాబీ జాన్సన్ కు ఈ విషయం ఎలా తెలిసి ఉంటుంది? అన్న సందేహం వచ్చే ఉంటుంది. ఓ రకమైన దుర్వాసన అనిపించడంతో అతడికి సందేహం వచ్చింది. దాంట్లో తన నివాసంలో రహస్య కెమెరా అమర్చాడు. కాఫీ మేకర్ లో ఏదో గుర్తు తెలియని పదార్థాన్ని ఫెలికానో వేస్తుండడం అందులో రికార్డు అయింది. అయినా సరే ఆమెకు సందేహం రాకూడదని ఆ కాఫీని రాబీ తాగేవాడు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసే రాబీ జాన్సన్.. మంతన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి భార్యతో కలిసి తిరిగి అమెరికాకు వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఒకటి, రెండు కాదు ఇంట్లోని చాలా ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు అమర్చాడు రాబీ జాన్సన్. దీంతో ఆమె చేస్తున్న కుట్ర రికార్డు అయింది. తన భర్త మరణిస్తే వచ్చే పరిహారం కోసం ఆమె ఇలా చేసినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.