Redmi 12 series: విడుదల రోజే 3 లక్షల రెడ్ మీ ఫోన్ల అమ్మకం

Redmi 12 series exceeds expectations sells over 300000 units on launch day
  • రెడ్ మీ 12 సిరీస్ ఫోన్లకు మంచి ఆదరణ
  • రెడ్ మీ 12 5జీ ధర రూ.10,999 నుంచి ప్రారంభం
  • రెడ్ మీ 12 4జీ ధర రూ.8,999
భారత మార్కెట్లో చైనీ మొబైల్ కంపెనీ షావోమీ రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. రెడ్ మీ బ్రాండ్ పై రెడ్ మీ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేయగా, మొదటి రోజే 3 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. రెడ్ మీ 12, రెడ్ మీ 12 5జీ ఫోన్లను నాలుగు రోజుల క్రితమే విడుదల చేసింది. ఫ్లాగ్ షిప్ ఫోన్ ఫీచర్లను అందిస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు తెగ ఆసక్తి చూపించారు. 

ఇందులో రెడ్ మీ 12 5జీ స్నాప్ డ్రాగన్ 4వ జనరేషన్ 5జీ ప్రాసెసర్ తో రావడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. 4ఎన్ఎం ఆర్కిటెక్చర్ పై ఇది తయారైంది. 5జీ వేగానికి అనుకూలంగా ఇది కూడా చాలా వేగవంతమైన పనితీరును అందిస్తుంది. రెడ్ మీ 12 సిరీస్ ఫోన్లు పెద్ద  ఎత్తున అమ్ముడుపోవడం వెనుక ధరల ప్రభావాన్ని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా పోటీ ధరలను రెడ్ మీ ప్రకటించింది.

రెడ్ మీ 12 5జీ ఫోన్ 6.79 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. దీని ధర రూ.10,999 నుంచి మొదలవుతుంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ.10,999. 6జీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.12,499. 8జీబీ ర్యామ్, 256 జీబీ వెర్షన్ ధర రూ.14,499. ఆగస్ట్ 4 నుంచి అమెజాన్, ఎంఐ డాట్ కామ్, రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

రెడ్ మీ 12 అనేది 4జీ ఫోన్. స్క్రీన్, రీఫ్రెష్ రేటు అన్నవి 5జీ ఫోన్ వేరియంట్ లో మాదిరే ఉంటాయి. మీడియాటెక్ హీలియో జీ88 12న్ఎం ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్, 8 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర రూ.8,999.
Redmi 12 series
smart phones
record sales

More Telugu News