Engineering Students: తూ.గో. జిల్లాలో విషాదం.. కారు కాల్వలో పడి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

Three Engineering Students Died In Road Accident In East Godavari Districts
  • ఏలూరులో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
  • విహారయాత్రకు రెండు కార్లలో 10 మంది విద్యార్థులు
  • తిరిగి వస్తుండగా అర్ధరాత్రి ప్రమాదం
  • బూరుగుపూడి సమీపంలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల్లో  ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు రెండు కార్లలో నిన్న విహారయాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లి గడిపారు. రాత్రి తిరిగి బయలుదేరారు. 

ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలో ఓ కారు అదుపుతప్పి పాత, కొత్త వంతెనల మధ్యనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఉదయ్‌కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Engineering Students
Eluru
East Godavari District
Road Accident

More Telugu News