bus: ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం... బస్సు నదిలో పడి ఇద్దరు మృతి

2 killed some critically injured as bus falls into river in Jharkhands Giridih
  • గిరిద్ జిల్లా దుమ్రీ గ్రామంలో అదుపు తప్పి నదిలో పడిన బస్సు
  • ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్, ఎమ్మెల్యే సుదివ్య కుమార్
  • బ్రిడ్జి రెయిల్స్‌ను ఢీకొట్టి 50 మీటర్ల లోతున నదిలో పడిపోయిన బస్సు

ఝార్ఖండ్‌లో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గిరిద్ జిల్లాలోని దుమ్రీ గ్రామంలో ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. కొంతమంది నీటిలో మునిగిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

బస్సు నదిలో పడిన విషయం తెలియగానే అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు ప్రయాణికులు ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లుగా సమాచారం.

ఈ బస్సు రాంచీ నుండి గిరిద్‌కు బయలుదేరింది. గిరిద్-దుమ్రి రహదారిలో బస్సు అదుపుతప్పి బ్రిడ్జి రెయిల్స్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత 50 మీటర్ల లోతున నదిలో పడింది. ఘటనా స్థలికి గిరిద్ ఎమ్మెల్యే సుదివ్య కుమార్, డీసీ నామన ప్రియేష్ లక్రా చేరుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News