Bhola Shankar: "ఒకటి రెండు మూడు... వచ్చాడు అన్న చూడు"... భోళాశంకర్ నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్

Rage of Bhola song from Bhola Shankar out now
  • చిరంజీవి హీరోగా భోళాశంకర్
  • కథానాయికగా తమన్నా
  • చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్
  • ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు భోళాశంకర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళాశంకర్ చిత్రం నుంచి మరో హుషారైన సాంగ్ ఇవాళ రిలీజైంది. "ఒకటి రెండు మూడు... వచ్చాడు అన్న చూడు" అంటూ ఈ సాగే ఈ ర్యాప్ సాంగ్ భోళాశంకర్ ఆవేశాన్ని చాటేలా ఉంటుంది. 

ఈ పాటను నవాబ్ గ్యాంగ్ ర్యాప్ బ్యాండ్ కు చెందిన గాయకులు అసుర, ఫిరోజ్ ఇజ్రాయెల్ ఆలపించారు. మహతి స్వరసాగర్ బాణీలకు దర్శకుడు మెహర్ రమేశ్, ఫిరోజ్ ఇజ్రాయెల్ సాహిత్యం అందించారు. 

భోళాశంకర్ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేశ్ మెగాస్టార్ చెల్లెలి పాత్ర పోషించింది. ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న భోళాశంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

  • Loading...

More Telugu News