Samantha: తన చికిత్సలపై వదంతులను కొట్టి పడేసిన సమంత

Samantha rubbishes rumours of taking financial help of Rs 25 crore for Myositis treatment
  • మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత
  • చికిత్స కోసం రూ.25 కోట్ల సాయాన్ని తీసుకున్నట్టు వార్తలు
  • ఇలాంటి ప్రచారం చేసే విషయంలో బాధ్యతగా ఉండాలన్న నటి

ప్రముఖ నటి సమంతా రుతు ప్రభు ఆరోగ్య చికిత్సా వ్యయం చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య ఆటోఇమ్యూన్ డిజార్డర్ మయోసైటిస్ బారిన పడినట్టు సమంత ప్రకటించడం తెలిసే ఉంటుంది. సినిమాలకు కొంత విరామం తీసుకుని ఆమె చికిత్స తీసుకుంది. కోలుకోవడంతో తిరిగి నటన మొదలు పెట్టింది. అయితే, మరో విడత సమంత ఇటీవల సినిమాకు బ్రేక్ తీసుకుంది. 

వ్యాధి నిరోధక వ్యవస్థ లోపాలతో వచ్చే వ్యాధులకు శాశ్వత పరిష్కారం ఉండదు. సమస్య పెరిగినప్పుడల్లా చికిత్స తీసుకోవడం ద్వారా ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే సమంతా మరో విడత విశ్రాంతి తీసుకున్నట్టు తెలుస్తోంది. మయోసైటిస్ అనేది కండరాలకు సంబంధించిన సమస్య. సమంత తన చికిత్స కోసం రూ.25 కోట్లను ఓ నటుడి నుంచి ఆర్థిక సాయంగా తీసుకున్నట్టు ప్రచారం వెలుగులోకి వచ్చింది. వీటిని సమంత ఖండించింది. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.

‘‘మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇందులో నేను ఖర్చు చేసింది చాలా స్వల్ప మొత్తమే. నా కెరీర్ లో సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. నేను నా జాగ్రత్తలు చూసుకోగలను. ధన్యవాదాలు. మయోసైటిస్ అనేది ఓ సమస్య. వేలాది మంది దీనితో బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండాలి’’అని సమంతా పేర్కొంది. 

  • Loading...

More Telugu News