Chandrayaan 3: చంద్రయాన్-3కు ఈరోజు అత్యంత కీలకం

  • ఈ రోజు భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్న చంద్రయాన్-3
  • రాత్రి 7 గంటల సమయంలో చోటుచేసుకోనున్న కీలక ఘట్టం
  • అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 23న చంద్రుడిపై దిగనున్న విక్రమ్ ల్యాండర్
Chandrayan 3 to enter from earth orbit to moon orbit today

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ లో ఈరోజ కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించబోతోంది. ఇప్పటికే చంద్రుడి దిశగా చంద్రయాన్-3 చాలా దూరం ప్రయాణించింది. ఈ రాత్రి 7 గంటల సమయంలో ఇది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో తెలిపింది. 

అన్నీ సవ్యంగా జరిగితే ఈ నెల 23న చంద్రుడి ఉపరితలం పైకి స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్ దిగుతుంది. చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ కు ఇదే ప్రధానమైన తేడా అని చెప్పింది. 

గతంలో చంద్రయాన్-2 మిషన్ ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొంది. దీంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు పని చేయకుండా పోయాయి. ఇప్పుడు ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసి జాబిల్లి మీదకు పంపారు.

More Telugu News