Vidadala Rajini: చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: ఏపీ మంత్రి విడదల రజని

Chandrababu knows that TDP will close after elections says Vidadala Rajani
  • చంద్రబాబు జోక్ లకు ప్రజలు నవ్వుకుంటున్నారన్న విడదల రజని
  • ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందనే విషయం బాబుకు అర్థమయిందని ఎద్దేవా
  • దత్తపుత్రుడితో కలిసి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వేస్తున్న జోక్ లకు ప్రజలు విరగబడి నవ్వుతున్నారని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ, చంద్రబాబు అండ్ కో అడ్రస్ గల్లంతవుతుందని... ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా అర్థమయిందని... అందుకే తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ తో కలిసి వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 

గత నాలుగేళ్లుగా సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయామనే అక్కసుతో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ శ్రేణులు బురద చల్లుతున్నాయని అన్నారు.

టీడీపీ నేతల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రజిని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి శూన్యమని... జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా పురోగమిస్తోందని చెప్పారు. 11 మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత జగన్ దేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఘోరంగా టీడీపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
Vidadala Rajini
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News