Rahul Gandhi: బీహార్ నుంచి మటన్ తెప్పించి, స్వయంగా వండి రాహుల్ కు విందు ఇచ్చిన లాలూ

Mutton By Chef Lalu Yadav On Menu For Dinner With Rahul Gandhi
  • సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాహుల్ గాంధీని అభినందించిన ఆర్జేడీ చీఫ్
  • ఆప్యాయంగా హత్తుకుని డిన్నర్ కు తీసుకెళ్లిన వైనం
  • ఢిల్లీలోని లాలూ కూతురు ఇంట్లో విందు
పరువు నష్టం దావాలో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. రాహుల్ జైలు శిక్షపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కూడా సుప్రీంతీర్పుపై హర్షం ప్రకటించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఢిల్లీలో తన కూతురు మీసాభారతి ఇంటికి రాహుల్ గాంధీని డిన్నర్ కు ఆహ్వానించారు.

శుక్రవారం రాత్రి కుమారుడు తేజస్వీ యాదవ్ తో కలిసి రాహుల్ గాంధీని స్వాగతించారు. బొకే ఇచ్చి, ఆప్యాయంగా హత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. రాహుల్ కోసమని ప్రత్యేకంగా బీహార్ నుంచి మటన్ తెప్పించి, లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా వండి వడ్డించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పుతో పాటు దేశ రాజకీయాలపై వారి మధ్య చర్చ జరిగిందని లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Rahul Gandhi
Lalu Prasad Yadav
Dinner
Chef Lalu Yadav
Mutton

More Telugu News