Article 370: ఆర్టికల్ 370 రద్దు.. నాలుగేళ్లలో జమ్మూకశ్మీర్ లో వచ్చిన మార్పులు ఏమిటంటే..!

The Changes In Kashmir In The 4 Years After Abrogation Of Article 370
  • హైవేలు, రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కేంద్రం
  • జమ్మూ కశ్మీర్ లో రెండు ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం
  • 75 ఏళ్ల తర్వాత దీపావళి సంబరాలు
  • 34 ఏళ్ల తర్వాత శ్రీనగర్ వీధుల్లో మొహర్రం ఊరేగింపు
జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జమ్మూ, కశ్మీర్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.ఈ నాలుగేళ్లలో అక్కడ వచ్చిన కొన్ని మార్పులు, జరిగిన అభివృద్ధి వివరాలు.. (వీడియో కోసం)

  • జమ్మూ కశ్మీర్ లోని చీనాబ్ నదిపై కేంద్ర ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి నిర్మించింది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా రికార్డయింది. ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జి ఎత్తు 29 మీటర్లు ఎక్కువ. జమ్మూ-కశ్మీర్ రీజియన్ లను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు.
  • ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్ ట్యూబ్ హైవే టన్నెల్ కూడా జమ్మూ కశ్మీర్ లోనే నిర్మించడం జరిగింది.
  • శ్రీనగర్ - జమ్మూ హైవేను కేంద్రం అప్ గ్రేడ్ చేసింది.
  • జమ్మూ కశ్మీర్ లో నిర్మించతలపెట్టిన 53 మెగా ఇన్ ఫ్రా ప్రాజెక్టులలో 32 ఇప్పటికే పూర్తయ్యాయి.
  • గతంలో ఎన్నడూ లేనంతగా టూరిజం బూమ్ ఏర్పడింది.. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 4.70 లక్షల మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్ ను సందర్శించారు. గడిచిన 7 నెలల్లో 1.27 కోట్ల మంది పర్యటించారు.
  • 30 ఏళ్ల తర్వాత సినిమా హాల్ ప్రారంభమైంది.
  • జమ్మూ కశ్మీర్ కు రెండు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) దక్కాయి.
  • దాదాపు 75 ఏళ్ల తర్వాత శారదా మాత ఆలయంలో దీపావళి వేడుకలు జరిగాయి.
  • 34 ఏళ్ల తర్వాత శ్రీనగర్ వీధుల్లో మొహర్రం ఊరేగింపు జరిగింది.
  • ఈ ఏడాది శ్రీనగర్ లో జి20 సమిట్ టూరిజం మీట్ జరిగింది.
Article 370
Jammu And Kashmir
Abrogation
Railway bridge

More Telugu News