Supreme Court Bench: హైదరాబాద్‌లో సుప్రీం బెంచ్ కోరుతూ చేవెళ్ల ఎంపీ ప్రైవేటు బిల్లు

chevella mp Ranjith reddy asks for SC bench in hyderabad introduces Private member bill in LS
  • లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఎంపీ డా. గడ్డం రంజిత్ రెడ్డి
  • ఐదుగురు జడ్జీలకు తగ్గకుండా శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని వినతి
  • కేసుల సత్వర పరిష్కారానికి ఇది అవసరమని వ్యాఖ్య
హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఐదుగురు జడ్జీలకు తగ్గకుండా పర్మినెంట్ బెంచ్ ఏర్పాటు చేయాలి. కేసుల సత్వర పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుంది. దేశప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉండే హైదరాబాద్ బెంచ్ ‌పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, కేరళతో పాటూ కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, దాద్రానగర్ హవేలీ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులను చేర్చాలి’’ అని కోరారు.
Supreme Court Bench
Supreme Court
Hyderabad

More Telugu News