GV Reddy: టీడీపీ శ్రేణుల దెబ్బకు వైసీపీ శ్రేణులు పారిపోయాయి: జీవీ రెడ్డి

GV Reddy condemns today incidents at Punganuru during Chandrababu visit
  • చంద్రబాబు పుంగనూరు పర్యటన ఉద్రిక్తం
  • టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీచార్జి
  • జిల్లా ఎస్పీ వైసీపీ నేతలా మాట్లాడుతున్నాడన్న టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి
పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జరిగిన సంఘటనలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి స్పందించారు. పుంగనూరులో ఇవాళ జరిగిన పరిణామాలను ఆయన ఖండించారు. టీడీపీ శ్రేణుల దెబ్బకు వైసీపీ శ్రేణులు పారిపోయాయని ఎద్దేవా చేశారు. జిల్లా ఎస్పీ వైసీపీ నాయకుడి మాదిరిగా మాట్లాడుతున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. ఇకపై జరిగే దాడులకు ప్రతి దాడులు ఉంటాయని స్పష్టం చేశారు. 

ఇవాళ తీవ్ర ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సాగింది. పుంగనూరులో చంద్రబాబుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు, పోలీసుల లాఠీచార్జి వంటి ఘటనలతో వాతావరణం వేడెక్కింది.
GV Reddy
Chandrababu
Punganuru
TDP
YSRCP

More Telugu News