Chandrababu: పుంగనూరులోనూ హై టెన్షన్... చంద్రబాబుకు అనుమతి లేదంటున్న పోలీసులు!

High Tension in Punganuru as Chandrababu coming to the town
  • అంగళ్లు నుంచి పుంగనూరు బయల్దేరిన టీడీపీ అధినేత
  • భీమగానిపల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు నిలిపిన పోలీసులు!
  • పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం
  • టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీచార్జి
  • గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటన ఉద్రిక్తంగా మారుతోంది. చంద్రబాబుకు పుంగనూరుకు వచ్చేందుకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భీమగానిపల్లి వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డంగా లారీలు, వాహనాలను నిలిపారు. దాంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. 

ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు. ఓ దశలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలిసింది. పోలీసుల వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 

అటు, చంద్రబాబు అంగళ్లు నుంచి వెళ్లిపోయాక వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. టీడీపీ కార్యకర్తలకు చెందిన కార్లను లక్ష్యంగా చేసుకుని వైసీపీ వర్గీయులు దాడులు జరిపారు. 20 కార్లకు పైగా అద్దాలను ధ్వంసం చేశారు.
Chandrababu
Punganuru
Police
TDP
YSRCP

More Telugu News