Priyanka Gandhi: సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపిన ప్రియాంకాగాంధీ

Priyanka Gandhi Thanks Supreme Court
  • పరువునష్టం కేసులో రాహుల్ కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
  • కింది కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించిన సుప్రీం
  • సత్యమేవ జయతే అంటూ ప్రియాంక ట్వీట్
మోదీ ఇంటి పేరుకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కింది కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది. దీంతో ఆయన మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమయింది. ఈ నేపథ్యంలో రాహుల్ సోదరి ప్రియాంకగాంధీ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేశారు. సూర్యుడు, చంద్రుడు, నిజం అనే మూడు ఎక్కువ కాలం దాగి ఉండవనే గౌతమ బుద్దుడి వ్యాఖ్యను కోట్ చేశారు. సత్యమేవ జయతే అని అన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
Priyanka Gandhi
Rahul Gandhi
Supreme Court

More Telugu News