Supreme Court: మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

  • మార్గదర్శి కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి బదిలీ చేయాలంటూ ఏపీ ప్రభుత్వ పిటిషన్
  • ప్రభుత్వ విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు
  • న్యాయపరిధి అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచన
Backlash for AP Government in Margadarsi case

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. ఈ సంస్థకు చెందిన కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి బదిలీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు న్యాయపరిధి అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. 

మరోవైపు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే వదిలేస్తూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. 

More Telugu News