Rahul Gandhi: గోవా నుంచి తన ఇంటికి ‘పప్పీ’ని తెచ్చుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi brings home Jack Russell Terrier puppy after Goa visit
  • బుధవారం గోవా పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత
  • మపుసా పట్ణణంలో కుక్కల పెంపక కేంద్రానికి వెళ్లిన రాహుల్
  • తనకు నచ్చిన రెండు కుక్క పిల్లలను ఎంచుకున్న రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గోవా నుంచి ఢిల్లీలోని తన నివాసానికి ఓ అతిథిని తెచ్చుకున్నారు. బుధవారం గోవా వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. తన వెంట మూడు నెలల జాక్ రస్సెల్ టెర్రియర్ పప్పీ (కుక్కపిల్ల)ని తీసుకొచ్చారు. గోవాలోని మపుసా పట్టణంలో స్టాన్లీ బ్రగాన్క- శివాని పిత్రే దంపతులు నిర్వహిస్తున్న కుక్కల పెంపక కేంద్రానికి వెళ్లిన రాహుల్ అక్కడ తనకు నచ్చిన రెండు కుక్క పిల్లలను ఎంచుకున్నారు. వాటిలో ఒక దాన్ని తన వెంట తీసుకెళ్లగా.. మరోదాన్ని ఆయనకు పంపిస్తామని శివాని పిత్రే తెలిపారు. 

గోవా విమానాశ్రయానికి బయలుదేరే ముందు రాహుల్ గాంధీ కొద్ది సేపు తమ కుక్కల కెన్నెల్‌లో ఉన్నారని పిత్రే చెప్పారు. ఆయన చాలా నిరాడంబరంగా ఉన్నారన్నారు. కెన్నెల్ లో ఉన్నంతసేపు కుక్కలతో ఆడుకున్నారని చెప్పారు. కాగా, తన గోవా పర్యటనలో గోవా ఎమ్మెల్యేలు, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమిత్ పాట్కర్‌ సహా కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ ఓ హోటల్‌లో సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News