Kothagudem: ఫొటోలు దిగితే టమాటాలు ఉచితం.. కొత్తగూడెంలో ఫొటోగ్రాఫర్ ఆఫర్

Kothagudem photographer offers free tomatoes to customers who take passport size photo
  • ఫొటో స్టూడియో ముందు బారులు తీరిన జనం
  • ఒక్కరోజే 32 మంది ఫొటోలు దిగారన్న ఓనర్
  • ఒక్కొక్కరికీ పావు కిలో చొప్పున టమాటాలు అందించినట్లు వెల్లడి
మార్కెట్లో టమాటాల ధర రోజురోజుకూ పెరిగిపోతుండడంతో దానిని తన వ్యాపారం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నాడో ఫొటోగ్రాఫర్.. తన షాపులో రూ.100 చెల్లించి 8 పాస్ పోర్ట్ సైజు ఫొటోలు తీసుకున్న వారికి పావుకిలో టమాటాలు ఉచితమని ప్రకటించాడు. ఏకంగా ఫ్లెక్సీలు వేయించి నగరంలోని పలు కూడళ్లలో బ్యానర్లు కట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఈ ఫొటోగ్రాఫర్ ప్రకటించిన ఆఫర్ జనాలను ఆకట్టుకుంటోంది. దీంతో కస్టమర్లు ఆయన షాపు ముందు క్యూ కట్టారు.

కొత్తగూడెం బస్టాండ్ కాంప్లెక్స్ లో ఉన్న ఫొటో స్టూడియో ఓనర్ పేరు ఆనంద్.. ఇటీవల గిరాకీ తగ్గడంతో ఆనంద్ సరికొత్త ఆఫర్ ప్రకటించాడు. తన షాపులో పాస్ పోర్టు ఫొటోలు దిగిన వారికి పావుకిలో టమాటాలు ఫ్రీగా ఇస్తానని బోర్డు పెట్టాడు. నగరంలో పలుచోట్ల బ్యానర్లు కట్టాడు. 8 పాస్ పోర్టు సైజు ఫొటోలకు రూ.100 చెల్లిస్తే రూ.40 విలువైన టమాటాలు ఇంటికి తీసుకెళ్ల వచ్చని చెప్పాడు. దీంతో కస్టమర్లు తన షాపుకు క్యూ కడుతున్నారని వివరించాడు.

గతంలో రోజుకు నలుగురైదుగురు కస్టమర్లు మాత్రమే వచ్చేవారని, టమాటాల ఆఫర్ తో బుధవారం ఒక్కరోజే 32 మంది కస్టమర్లు వచ్చారని చెప్పాడు. వారికి తలా పావుకిలో టమాటాలు అందించినట్లు వివరించాడు. ఫ్రీ టమాటాల ఆఫర్ తో ముందుముందు గిరాకీ మరింత పెరుగుతుందని ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Kothagudem
photographer
passport size photos
free tomatoes
customers

More Telugu News