samsunng: 110 ఇంచుల సామ్‌సంగ్ ఎల్ఈడీ టీవీ.. ధర రూ.1,14,99,000 మాత్రమే!

Samsung launches micro LED TV with 110 inch screen price starts at a whopping 1crore
  • అల్ట్రా లగ్జరీ మైక్రో ఎల్‌ఈడీ టీవీని విడుదల చేసిన సామ్‌సంగ్
  • టీవీలో 2.48 కోట్ల చిన్న సైజ్‌ఎల్‌ఈడీలు
  • అధునాతన ఫీచర్లతో రూపొందిన టీవీ
సాధారణంగా ఇంట్లోకి టీవీ కొనాలంటే ధర వేలల్లో ఉంటుంది. బ్రాండ్, స్క్రీన్ సైజ్, ఫీచర్స్‌ను బట్టి ధర పెరుగుతూ ఉంటుంది. లగ్జరీ టీవీల ధరలు లక్షల్లోనూ ఉంటాయి. అయితే, సామ్‌సంగ్‌ కంపెనీ ఏకంగా కోటి పైన విలువైన అల్ట్రా లగ్జరీ మైక్రో ఎల్‌ఈడీ టీవీని భారత్‌లో ప్రవేశ పెట్టింది. ఈ టీవీ స్క్రీన్‌సైజ్‌ 110 ఇంచులు కాగా ధర రూ.1,14, 99,000 కావడం గమనార్హం. ఇంత భారీ ధర ఉన్న టీవీలో ఆ స్థాయికి తగ్గట్టు ఫీచర్స్‌ కూడా ఉంటాయి. ఈ ఎల్‌ఈడీ టీవీలో 2.48 కోట్ల చిన్న సైజ్ ఎల్‌ఈడీలు అమర్చారు. 

ఈ ఎల్‌ఈడీలన్నీ ఒక్కొక్కటిగా లైట్‌, కలర్‌‌ను విడుదల చేస్తాయి. దాంతో, అత్యంత నాణ్యమైన దృశ్యాలను చూడవచ్చు. థియేటర్‌‌ ను మించిన క్లారిటీతో డాల్బీ అట్మోస్‌,  3డీ సౌండ్‌వంటి హై క్వాలిటీ ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. పైగా, ఈ భూమి మీద లభించే రెండో దృఢమైన పదార్థం అయిన సాఫైర్‌‌ పదార్థంతో ఈ టీవీని తయారు చేయడం అతి పెద్ద విశేషం. ఈ టీవీ ఎంపిక చేసిన తమ స్టోర్లలో లభ్యం అవుతుందని సామ్‌సంగ్ తెలిపింది.
samsunng
1.15 cr
tv
micro LED TV

More Telugu News