Sania Mirza: ఇన్‌స్టా బయోలో షోయబ్ మాలిక్ కీలక మార్పు.. సానియా మీర్జాతో ఇక విడాకులేనా?

Shoaib Maliks Instagram hint sparks divorce rumors with Sania Mirza
  • మరోసారి తెరపైకి షోయబ్, సానియా విడాకుల అంశం
  • ఇన్‌స్టా బయోలో ‘సానియా భర్త’ అన్న వాక్యాన్ని తొలగించిన షోయబ్
  • దాని స్థానంలో ‘ఓ బిడ్డకు తండ్రి’ అన్న వాక్యం చేరిక
  • తాజా మార్పులతో మళ్లీ మొదలైన విడాకుల వదంతులు
పాకిస్థానీ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో కీలక మార్పు చేయడమే ఇందుకు కారణం. ఒకప్పుడు ఆయన బయోలో ‘సానియా భర్త’ అని రాసుండేది. ప్రస్తుతం దాని స్థానంలో ‘ఓ బిడ్డకు తండ్రి’ అన్న వాక్యం వచ్చి చేరడంతో విడాకుల వదంతులు వైరల్‌గా మారాయి. 

సానియా, షోయబ్  2010లో వివాహం చేసుకున్నారు. వారికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. తొలినాళ్లల్లో వారి బంధం దృఢంగా ఉన్నట్టు అనిపించినా ఆ తరువాత పలుమార్లు విడాకుల వార్తలు మీడియాలో వెలువడ్డాయి. షోయబ్ గతంలో ఓమారు ఈ వార్తలపై స్పందించాడు. తాము కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, వృత్తిపరంగా తామిద్దరం బిజీబిజీగా గడుపుతూ ఉండటం తమ బంధానికి ఓ సవాలుగా మారిందని అప్పట్లో వ్యాఖ్యానించాడు.  

తాజాగా షోయబ్ ఇన్‌స్టా బయోకు చేసిన మార్పులతో మరోసారి విడాకుల వదంతులు జోరందుకున్నాయి. ఇటీవల కాలంలో అనేక మంది సెలబ్రిటీలు విడాకుల ప్రకటనకు ముందు ఇన్‌స్టాలో తమ తమ జీవిత భాగస్వాముల ఫొటోలు, ఇతర విషయాలను తొలగిస్తున్న విషయం తెలిసిందే.
Sania Mirza
Shoaib Malik
Divorce rumors
India
Pakistan

More Telugu News