రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం

రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం

KCR orders on farmer loan waiver in Telangana
  • కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు ఆరోపణ
  • నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శ
  • సెప్టెంబర్ 2వ వారం లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ఆదేశం
రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆదేశించారు. రేపటి నుండి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభించాలన్నారు. కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు తెలిపారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే రుణమాఫీ ఆలస్యమైందన్నారు. ఎఫ్ఆర్‌బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్షంగా కోత విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు మరో రూ.19వేల కోట్ల రుణాలను అందించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో రుణమాఫీని మళ్లీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుండి రైతు రుణమాఫీని ప్రారంభించి, సెప్టెంబర్ 2వ వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ఇవే చివరి సమావేశాలు. మొదటి దఫా రుణమాఫీ తర్వాత నిలిపివేయడంతో ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాయి. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు రుణమాఫీ ఆయుధంగా మారనున్న నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.

Advertisement
KCR
loan waiver
Telangana
farmer

More Telugu News