Ambati Rambabu: బ్రో సినిమాపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: అంబటి రాంబాబు

Ambati Rambabu again on Bro film
  • ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పిన అంబటి రాంబాబు
  • కీలక విషయమై వెళ్తున్నట్లు వెల్లడి
  • ఢిల్లీ నుండి వచ్చాక అన్ని విషయాలు చెబుతానన్న మంత్రి
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి అంబటి రాంబాబు బుధవారం అన్నారు. ఈ రోజు తాను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. ఒక కీలకమైన విషయమై తాను వెళ్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుండి వచ్చాక తాను అన్ని వివరాలను మీడియాకు చెబుతానని తెలిపారు.

బ్రో సినిమాకు అక్రమమార్గంలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని అంబటి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి తాను చెప్పాల్సింది చెప్పానని, అలాగే బ్రో చిత్ర నిర్మాత కూడా తాను చెప్పాల్సింది చెప్పారని అన్నారు. ఈ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ ఎవరిదో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.

బ్రో సినిమాలో తనను పోలిన పాత్ర ద్వారా కించపరిచారని అంబటి ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రో సినిమా వ్యవహారంలో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీ ఎంపీలతో కలిసి ఆయన ఢిల్లీలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారని తెలుస్తోంది.
Ambati Rambabu
bro
YSRCP
Telugudesam

More Telugu News