Raghu Rama Krishna Raju: పెళ్లయిన మహిళను నిన్న ఒక వాలంటీర్ తీసుకెళ్లాడు: రఘురామకృష్ణ రాజు     

One volunteer took a lady with him says Raghu Rama Krishna Raju
  • మొన్న విశాఖలో ఒక మహిళను వాలంటీర్ హత్య చేశాడన్న రఘురాజు
  • ఈ దారుణాలకు జగనే బాధ్యత వహించాలని వ్యాఖ్య
  • కోడికత్తి శీను జీవితం కూడా మొద్దు శీను మాదిరే అవుతుందేమోనని సందేహం
ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. వాలంటీర్ల కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. మొన్న విశాఖలో వృద్ధ మహిళను ఒక వాలంటీర్ హత్య చేశాడని... నిన్న ఒక వివాహితను మరో వాలంటీర్ తీసుకెళ్లిపోయాడని మండిపడ్డారు. ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి వాలంటీర్లు స్వేచ్ఛగా వెళ్లే అధికారాన్ని ఎవరిచ్చారని ప్రశ్నించారు. 

ఈ దారుణాలకు ముఖ్యమంత్రి జగనే బాధ్యత వహించాలని అన్నారు. వాలంటీర్లు బియ్యం ఇవ్వడానికి వచ్చి... మీకు బియ్యం కావాలా? డబ్బులు కావాలా? అని అడుగుతున్నారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 

బాబాయ్ వివేకాను హత్య చేసిన వ్యక్తి హాయిగా బయట తిరుగుతున్నాడని... పాపం కోడికత్తి శీను మాత్రం జైల్లోనే ఉన్నాడని రఘురాజు అన్నారు. కోడికత్తి శీను జీవితం కూడా మొద్దు శీను జీవితం మాదిరి అవుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. కోడికత్తి శీను ఉన్న జైల్లో కూడా ఎవరో బీహారీ వ్యక్తి ఉన్నాడని చెపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. 

Raghu Rama Krishna Raju
Kodi Kathi Sreenu
Jagan
YSRCP
Nara Lokesh
Telugudesam

More Telugu News