Rishvi: కుటుంబ క‌థా చిత్రంగా వ‌స్తోన్న 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'

  • తెరపైకి మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ
  • రిష్వి హీరోగా 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'
  • తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో నడిచే కథ 
  • ఈ నెల 4వ తేదీన సినిమా రిలీజ్ 

Krishnagadu Ante Oka Range movie update

రిష్వి తిమ్మరాజు - విస్మయశ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ బ్యానర్ పై కృష్ణమూర్తి .. వెంకట సుబ్బమ్మ .. శ్రీలత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం, సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఆగ‌స్ట్ 4న ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో 'మంగళవారం' నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కే ఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా.. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ టీమ్ కి ఆల్ ది బెస్ట్. చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ, శుభాకాంక్షలు. మా వరంగల్ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ అన్నారు.

టీఎఫ్‌సీసీ సెక్రటరీ, నిర్మాత కే ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘కంటెంట్ ఉంటే సినిమాలు ఆడతాయి. కంటెంట్‌ను మాత్రమే కాకుండా కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాలి. అవి రెండూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి విలేజ్, లవ్ స్టోరీలకు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగుండాలి. ఈ మూవీకి వారిద్దరూ కూడా సెట్ అయ్యారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ చెప్పారు. 

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘నేను ఆల్రెడీ సినిమాను చూశాను. అద్భుతంగా ఉంది. మ్యూజిక్ బాగుంది. కెమెరావర్క్ బాగుంది. కొత్త వాళ్లతో దర్శకుడు సినిమాను బాగా తీశారు. అందమే కాదు నటనతో అందరినీ ఆకట్టుకోవచ్చు. విస్మయ అద్భుతంగా నటించింది. రిష్వి ఎక్కడా కూడా కొత్త హీరోగా అనిపించలేదు. ఎంతో కాన్ఫిడెంట్‌గా నటించాడు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 4న ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలి’ అన్నారు. 

నిర్మాత పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి మాట్లాడుతూ.. ‘కృష్ణ అనే యువ‌కుడి క‌థే ఇది. తండ్రి క‌ల‌ను నెర‌వేర్చ‌టానికి కొడుకు ప‌డ్డ క‌ష్టం. త‌న ప్రేమ‌, భావోద్వేగాల‌ను అందంగా చూపించే ప్ర‌య‌త్నమే మా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాను రాజేష్ గారు మలిచారు. చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోతూ ఉంటే వచ్చే సంఘర్షణను చూపించాం. ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 

డైరెక్టర్ రాజేష్ దొండపాటి మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్ రాము వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. తను నిర్మాత రఘు గారిని పరిచయం చేశారు. నా కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. మా నిర్మాతకు ఎంతో గట్స్ ఉన్నాయి. మమ్మల్ని నమ్మి మాకు చాన్స్ ఇచ్చిన నిర్మాత రఘు గారికి థాంక్స్. నా టీం మెంబర్లందరికీ థాంక్స్" అని చెప్పారు.

More Telugu News