Ch Malla Reddy: ఎన్నికల స్టంట్ అనుకోండి!: ఆర్టీసీ విలీనంపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Mallareddy interesting comments on RTC into government sector
  • ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా? అని అడిగిన మీడియా ప్రతినిధి
  •  ఏదైనా అనుకోండన్న మల్లారెడ్డి
  • కార్మికులు సంతోషంగా ఉన్నారా? లేరా? చూడాలని సూచన
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి... మాది రాజకీయ పార్టీ.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎట్లాగైనా ఎన్నికల స్టంట్ ఉంటుందని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి.. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా? అని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన మల్లారెడ్డి.. ఎన్నికలు అనుకోండి.. ఏవైనా అనుకోండి.. కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉందా? లేదా? అది ఆలోచన చేయాలని హితవు పలికారు. తమది రాజకీయ పార్టీ అని, కాబట్టి ఎన్నికల స్టంట్ ఉంటుందన్నారు. కానీ కార్మికులు సంతోషంగా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం, ఫండ్స్ కావాలన్నారు. అవన్నీ తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయన్నారు.
Ch Malla Reddy
rtc
KCR
Telangana

More Telugu News