Sai Rajesh: హైదరాబాద్ రోడ్లపై ఖాళీగా ఆరేళ్లు తిరిగాను: 'బేబి' డైరెక్టర్ సాయిరాజేశ్

  • 'బేబి'తో హిట్ కొట్టిన సాయిరాజేశ్ 
  • అవకాశాల కోసం చాలా కష్టాలు పడ్డానని వెల్లడి 
  • ఆరేళ్లపాటు తిరిగినా అసిస్టెంట్ ను కాలేకపోయానని వ్యాఖ్య
  • ఫ్రెండ్స్ సహకారంతోనే డైరెక్టర్ అయ్యానంటూ వివరణ  
Sai Rajesh Interview

ఇటీవల కాలంలో చాలా ఎక్కువమంది మాట్లాడుకున్న సినిమా 'బేబి'. సాయిరాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 100 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఫిల్మ్ ట్రీ' యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. తన కెరియర్ ను గురించిన విషయాలను పంచుకున్నాడు. 

"నేను పుట్టి పెరిగింది 'నెల్లూరు'లో .. మొదటి నుంచి చిరంజీవిగారి అభిమానిని .. ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. సినిమాల పట్ల గల ఆసక్తితో డైరెక్టర్ కావాలనే పట్టుదలతో హైదరాబాద్ వచ్చాను. ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలియదు .. నా ప్రయత్నాలను ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియదు. అందువలన ఆరేళ్ల పాటు ఇక్కడ రోడ్లపై ఖాళీగా తిరుగుతూ ఉండేవాడిని" అని అన్నాడు. 

" 2005లో హైదరాబాద్ వస్తే 2011 వరకూ కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఎక్కడా చేరలేకపోయాను. ఆ తరువాత వీఎన్ ఆదిత్య దగ్గర రెండేళ్లు లాస్ట్ అసిస్టెంట్ గా వర్క్ చేశాను. మళ్లీ ఆ తరువాత అదే పరిస్థితి. అప్పుడు యూఎస్ లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ కి టచ్ లోకి వెళ్లి, వారి హెల్ప్ తో 'హృదయ కాలేయం' చేశాను. అలా డైరెక్టర్ ను అయ్యాను" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News