Sobhitha Shulipala: అమెజాన్ ప్రైమ్ ట్రాక్ పైకి వచ్చేస్తున్న 'మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2'

Made in Heaven 2 streaming date cofirmed
  • 2019లో వచ్చిన 'మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2'
  • ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో పూర్తయిన సీజన్ 1 
  • సీజన్ 2 కోసం ప్రేక్షకులు వెయిటింగ్ 
  • ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2019లో 'మేడ్ ఇన్ హెవెన్' వెబ్ సిరీస్ వచ్చింది. సీజన్ 1 రసవత్తరమైన ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా ఇంట్రెస్టింగ్ అంశంపై సీజన్ 1 ముగిసింది. అప్పటి నుంచి కూడా అంతా సీజన్ 2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'సీజన్ 2'కి సంబంధించిన ప్రకటన వచ్చేసింది.

'పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి' అనే ఒక నానుడి ఉంది. దాని చుట్టూ అల్లిన కథ ఇది. 'సీజన్ 2' కూడా ఇదే అంశం చుట్టూ తిరగనుంది. ఈ నెల 10వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'కి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. శోభిత ధూళిపాళ్ల ప్రధానమైన పాత్రధారిగా ఈ కథ నడవనుంది. 

'మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2'కి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. శోభిత ధూళిపాళ్లతో పాటు అర్జున్ మాథుర్ .. కల్కి కొచ్లిన్ .. జిమ్ సౌరభ్ .. శశాంక్ అరోరా ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఫస్టు సీజన్ లో లేని ఆర్టిస్టులు కూడా సీజన్ 2లో కనిపించనున్నారు. ఫస్టు సీజన్ ట్విస్ట్ కి తగిన స్థాయికి సీజన్ 2 కొనసాగుతుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News