Nandyal: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నంద్యాల జిల్లా యువ జవాన్ వీర మరణం

Jawan from Andhra Pradesh sacrifices life in Jammu and Kashmir
  • సురేంద్రది పాములపాడు మండలం మద్దూరు పంచాయతీ
  • 2019లోనే సైన్యంలో చేరిన యువకుడు
  • మూడు రోజుల క్రితం ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి
  • నేడు స్వగ్రామానికి సురేంద్ర పార్థివదేహం
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంద్యాల జిల్లాకు చెందిన యువ సైనికుడు వీరమరణం పొందాడు. ఈ మేరకు నిన్న ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాములపాడు మండలం మద్దూరు పంచాయతీలోని కృష్ణానగర్ గ్రామానికి చెందిన సిరిగిరి సురేంద్ర (24) 2019లో సైన్యంలో చేరారు.

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సురేంద్ర మూడు రోజుల క్రితం ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు సైన్యాధికారుల నుంచి సమాచారం అందింది. ఆయన పార్థివదేహం నేడు స్వగ్రామం చేరే అవకాశం ఉంది. సెప్టెంబరులో వస్తానని మూడు రోజుల క్రితమే తల్లిదండ్రులు సుబ్బమ్మ, సుబ్బయ్యలకు చెప్పిన సురేంద్ర అంతలోనే మరణించాడన్న వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Nandyal
Army Jawan
Jammu And Kashmir
Terrorists

More Telugu News