Ayyanna Patrudu: వైనాట్ 175 అంటున్న వ్యక్తికి ప్రజల్లో తిరగడానికి భయమెందుకు?: అయ్యన్నపాత్రుడు

Why Jagan is afraid of going into people asks Ayyanna Patrudu
  • గోదావరి వరద బాధితులను పరామర్శించే వాళ్లే లేరని అయ్యన్న విమర్శ
  • విశాఖను విజయసాయి నాశనం చేశారని మండిపాటు
  • జగన్ జైలుకు వెళ్తే అప్పులు ఎవరు తీరుస్తారని ప్రశ్న

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తి... ప్రజల్లో తిరిగేందుకు ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి నదికి వరదలు వస్తుంటే ప్రజలను పరామర్శించేవారే లేరని విమర్శించారు. 

విశాఖను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాశనం చేశారని... ప్రజల నుంచి రూ. 45 వేల కోట్ల విలువైన భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. భూదోపిడీపై విజయసాయి చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. జగన్ జైలుకు వెళ్తే రాష్ట్ర అప్పులను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్ ను గద్దె దించాల్సిందేనని చెప్పారు. తండ్రీకొడుకులు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు రాష్ట్రంలోని గనులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News