KTR: మంత్రి కేటీఆర్‌కు సుఖేశ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు!

Sukesh Chandrasekhar notices to KTR
  • తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు
  • తనపై చేసిన వ్యాఖ్యలను వారంలో ఉపసంహరించుకోవాలన్న సుఖేశ్
  • లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ సుఖేశ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను వారం రోజుల్లోగా ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు. సుఖేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండులో వున్నారు. 
KTR
Telangana
New Delhi

More Telugu News