V Srinivas Goud: రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై కబ్జా ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud condemns kabja allegations
  • గతంలోను తనపై కబ్జా ఆరోపణలు వచ్చాయన్న మంత్రి
  • మాయమాటలతో ఓట్లు సంపాదించుకోలేదని వ్యాఖ్య
  • కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్

తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఖండించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గతంలోను తనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాయమాటలతో తాను ఓట్లు సంపాదించుకోలేదని, ప్రజల కోసం పని చేస్తున్నానని చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేని వారు ఆరోపణలు చేస్తున్నారని, తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

వక్ఫ్ భూములను తాను కబ్జా చేసినట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయన్నారు. కులం చూసి కాదని, ప్రజలు గుణం చూసి గెలిపించారన్నారు. అధిక మెజార్టీతో గెలిచిన తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News