Malavika Mohanan: నచ్చకపోతే నో చెప్పేస్తా..రూ.500 కోట్లు అయినా లెక్కచేయను: మాళవిక మోహనన్

Malavika mohanan says she will act in movies if her role in the movie becomes insignificant
  • తన పాత్రకు ప్రాముఖ్యత లేకపోతే సినిమా ఒప్పుకోనన్న మాళవిక
  • గుర్తింపు లేని పాత్రల్లో నటిస్తే ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డ నటి
  • ఇకపై తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తానని వెల్లడి
మలయాళ, తమిళ చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన నటి మాళవిక మోహనన్, మాస్టర్ సినిమాలో విజయ్ పక్కన నటించి తెలుగు ప్రేక్షకులనూ మెప్పించింది. ఆమె సినీరంగంలోకి ప్రవేశించి దశాబ్దంపైగా గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. రూ.500 కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ ఫిలిం అయినా కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నో చెప్పేస్తానని స్పష్టం చేసింది. అలాంటి చిత్రాలు సూపర్ హిట్ అయినా తనకు గుర్తింపు రాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని కుండబద్దలు కొట్టింది. 

మోడలింగ్ నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన మాళవిక నెట్టింట్లో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తొలిసారిగా తన మాతృభాష మలయాళంలో రూపొందిన 'పట్టం బోల' చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. ఆ తరువాత రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'పేట' ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యింది. తొలి చిత్రంతోనే అక్కడి ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్, ధనుష్ పక్కన మారన్ చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది.
Malavika Mohanan
Tollywood
Kollywood

More Telugu News