Manchu Vishnu: మంచు విష్ణు కీలక నిర్ణయం

Manchu Vishnu sensational decision
  • వచ్చే 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న విష్ణు
  • తన పదవీ కాలం పూర్తయ్యేలోపల హామీలను నెరవేరుస్తానన్న విష్ణు
  • ప్రస్తుతం 'మా' అధ్యక్షుడిగా ఉన్న విష్ణు

సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధ్యక్షుడిగా తన కాల పరిమితి ముగిసేలోగా పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. మంచు విష్ణు ఇచ్చిన హామీల్లో 'మా' బిల్డింగ్ ముఖ్యమైనది. 


మరోవైపు నిన్న టీఎఫ్సీసీ ఎన్నికల్లో ఓటును వినియోగించుకున్న తర్వాత సినీ నటుడు నరేశ్ మాట్లాడుతూ... 'మా' బిల్డింగ్ గురించి మంచు విష్ణే చెప్పాలని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అందరం ప్రయత్నిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో మంచు విష్ణుకు నరేశ్ మద్దతుగా నలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News