Prigozhin: ఫైటర్లు సెలవుల్లో ఉన్నారు.. మాకు సిబ్బంది కొరత లేదు: వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్

Wagner pauses fighter recruitment and focuses on Africa and Belarus says Prigozhin
  • తాము కొత్త నియామకాలను చేపట్టడం లేదన్న ప్రిగోజిన్
  • మాతృభూమి కోసం మరో గ్రూప్ అవసరమైతే నియామకాలు చేపడతామని ప్రకటన
  • ఆఫ్రికా, బెలరాస్‌లో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడి
తనను పెంచి పోషించిన రష్యాపైనే గత నెలలో తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించారు వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్‌. బెలారస్ మధ్యవర్తిత్వం తర్వాత వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి బెలారస్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ మాట్లాడిన ఆడియోను వాగ్నర్‌‌ గ్రూప్‌నకు చెందిన టెలిగ్రామ్ చానల్‌లో ఉంచారు.

ఆఫ్రికా, బెలరాస్‌లో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రిగోజన్ చెప్పారు. ప్రస్తుతం కొత్త నియామకాలను చేపట్టడం లేదని చెప్పారు. చాలా మంది ఫైటర్లు సెలవుల్లో ఉన్నారని తెలిపారు. తమ గ్రూప్ భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేశామని, అవి రష్యా ప్రతిష్ఠను మరింత పెంచుతాయని చెప్పారు.

మరోవైపు ఆఫ్రికా దేశాలు, బెలారస్‌లోని శిక్షణ కేంద్రాల్లో గ్రూప్ కార్యకలాపాలు చురుగ్గానే ఉంటాయని అన్నారు. తమకు సిబ్బంది కొరత లేదని, ప్రస్తుతానికి నియామకాలు జరిపే ఉద్దేశం లేదని తెలిపారు. మాతృభూమి ప్రయోజనాలు రక్షించడానికి మరో గ్రూప్ అవసరమైన వెంటనే నియామకాలు చేపడతామని ప్రకటించారు. 
Prigozhin
Wagner
fighter recruitment
Russia
Belarus
Africa

More Telugu News