Tollywood: కొత్త డైరెక్టర్లు, రైటర్లకు ఆర్జీవీ డెన్‌ ఆహ్వానం

RGV DEN is looking for new aspiring directors
  • హైదరాబాద్‌లో ఆర్జీవీ డెన్‌ పేరిట ఆఫీస్ ప్రారంభించిన రామ్ గోపాల్ వర్మ
  • కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటన
  • వివరాలకు ఆర్జీవీ డెన్ వెబ్‌ సైట్‌ చూడాలని సూచన
ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్లుగా హిట్ సినిమాలకు దూరంగా వున్నారు. ప్రయోగాల పేరిట కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఆర్జీవీ డెన్ పేరిట హైదరాబాదులో ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. ఆర్వీ గ్రూప్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు. ఈ ఆర్జీవీ డెన్ తో ట్యాలెంట్ ఉన్నవాళ్లకు, కొత్తవాళ్లకు సినిమా, వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇస్తామని ఆయన గతంలో ప్రకటించారు.

తాజాగా ఇందుకు సంబంధించి ట్విట్టర్‌‌లో ప్రకటన విడుదల చేశారు. తమ సంస్థలో పని చేసేందుకు ఆసక్తిఉన్న వర్దమాన డైరెక్టర్లు, రైటర్లు, సినిమాటోగ్రాఫర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు https://rgvden.com వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి కేటగిరికి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి, ఇచ్చిన టాస్కులు చేసి, డీటెయిల్స్ పంపించాలని సూచించారు.
Tollywood
Bollywood
RGV
rgv den

More Telugu News