Remi Lucidi: 68వ అంతస్తు నుంచి పడి ఫ్రెంచ్ 'డేర్‌డెవిల్' రెమి లుసిడి మృతి

Daredevil Known For Skyscraper Climbs Dies After Falling From 68th Floor
  • డేర్‌డెవిల్‌గా పేరుగాంచిన రెమి లుసిడి
  • హాంకాంగ్‌లోని ది ట్రెగెంటర్ టవర్ కాంప్లెక్స్ వద్ద ఘటన
  • 68వ ఫ్లోర్‌లో చిక్కుకుపోయి పట్టు తప్పి కిందపడిన రెమి లుసిడి
ఎత్తయిన భవనాలు ఎక్కుతూ.. ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేయడంలో దిట్టగా పేరుగాంచిన ఫ్రెంచ్ డేర్‌డెవిల్ రెమి లుసిడి (30) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. హాంకాంగ్‌లోని ది ట్రెగెంటర్ టవర్ కాంప్లెక్స్‌ను ఎక్కే క్రమంలో 68వ అంతస్తు వద్ద పట్టు తప్పి కిందపడి మరణించాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. భవనాన్ని అధిరోహిస్తూ 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికీ బయట చిక్కుకుపోయాడు. దీంతో భయంతో అతడు కిటికీని బలంగా తన్నడంతో పట్టుతప్పి నేరుగా కిందపడి మరణించాడు. 

భవనంలోని 40వ ఫ్లోర్‌లో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు సాయంత్రం ఆరుగంటల సమయంలో లుసిడి భవనం వద్దకు వచ్చినట్టు సెక్యూరిటీ గార్డు తెలిపాడు. అయితే, సెక్యూరిటీ గార్డు నిర్ధారించుకునే లోపే అతడు లిఫ్ట్ ఎక్కేశాడు. లుసిడి 49వ ఫ్లోర్ వరకు లిఫ్ట్‌లో వెళ్లి ఆ తర్వాత మెట్లు ఎక్కినట్టు సీసీటీవీ ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత అతడు భవనం పైకి వెళ్లినట్టు కనిపించలేదు.

7.38 గంటల సమయంలో పెంట్‌హౌస్ కిటికీ తట్టడాన్ని పనిమనిషి చూసి పోలీసులకు ఫోన్ చేసింది. పెంట్‌హౌస్ బయట చిక్కుకుపోయిన లుసిడి సాయం కోసం కిటికీ పట్టుకున్నాడని, ఆ తర్వాత పట్టుతప్పి కిందపడ్డాడని పోలీసులు తెలిపారు. స్టంట్స్‌ను రికార్డు చేసే కెమెరాను ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నారు. కాగా, పోలీసులు అతడి మరణానికి కచ్చితమైన కారణాన్ని వెల్లడించలేదు.
Remi Lucidi
Daredevil
Hong Kong
Tregunter Tower complex

More Telugu News