Rajinikanth: ఏయ్ ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్ అంటున్న రజనీకాంత్

 Victory Venkatesh launched the Telugu version of Jailers Hukum song
  • జైలర్‌‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సూపర్‌‌ స్టార్
  • టైగర్‌‌ కా హుకుం పాట తెలుగు వెర్షన్‌ను లాంచ్‌ చేసిన వెంకటేశ్
  • ఆగస్టు 10న విడుదల కానున్న సినిమా
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కళానిధి మారన్ నిర్మిస్తున్న చిత్రం ఆగస్టు పదో తేదీన విడుదల కానుంది. నేరుగా తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర బృందం జోరు పెంచింది. రెండు రోజుల కిందట చెన్నైలో సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నువ్వు కావాలయ్య.. హుకుం పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. హుకుం పాట తెలుగు వెర్షన్‌ ను విక్టరీ వెంకటేశ్ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు. తెలుగు వెర్షన్‌ కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

‘ఏయ్.. ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్‌ను నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది గప్‌చుప్‌గా ఫాలో అవ్వాలి’ అంటూ రజనీకాంత్‌ డైలాగ్స్‌తో పాట మొదలైంది. ‘హుకుం.. టైగర్ కా హుకుం.. ఉరుముకు, మెరుపుకి పుట్టాడురా.. తరతరతరముల సూపర్ స్టార్ రా..’ అంటూ రజనీ మాస్‌ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని భాస్కర బట్ల పాట రాశారు. ఈ పాటలో రజనీకాంత్ మాస్ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. 
Rajinikanth
Venkatesh Daggubati
Jailer movie
Hukum song

More Telugu News