Bro Movie Collections: రికార్డు స్థాయిలో 'బ్రో' కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే..!

Pawan Kalyan Bro movie collections in first 3 days
  • ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ 'బ్రో' మూవీ
  • 3 రోజుల్లో రూ. 97.50 కోట్ల వసూళ్లు
  • ఓవర్సీస్ లో రూ. 12 కోట్ల కలెక్షన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే ఇలా ఉంటుంది. ప్రేక్షకులతో థియేటర్లు కిక్కిరిసి పోవాల్సిందే. పవన్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బ్రో' ఘన విజయం సాధించింది. ఒక మంచి మెసేజ్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల వరకు వసూలు చేసింది.

నైజాంలో రూ. 30 కోట్లు, ఆంధ్రలో రూ. 37.30 కోట్లు, సీడెడ్ లో రూ. 13.20 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్లను వసూలు చేసింది. కర్టాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 12 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం మీద తొలి 3 రోజుల్లోనే రూ. 97.50 కోట్లను కలెక్ట్ చేసి... రికార్డు స్థాయి కలెక్షన్లతో 'బ్రో' దూసుకుపోతోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో రాబోయే రోజుల్లో కూడా భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News