Priyanka Chaturvedi: ప్రియాంక చతుర్వేది అందం చూసే ఆమెను రాజ్యసభకు పంపారు.. ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Maharashtra MLA Sanjay Shirsat controversial comments on Priyanka Chaturvedi
  • శిర్సత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ప్రియాంక
  • ఆత్మను అమ్ముకున్న ద్రోహి అంటూ మండిపాటు
  • కుళ్లిన మనస్తత్వం కలిగిన నేత అన్న ఆదిత్య థాకరే
ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన ఎమ్మెల్యే ప్రియాంక చతుర్వేదిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందాన్ని చూసి ఆదిత్య థాకరే ఆమెను రాజ్యసభకు పంపారంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

దీంతో స్పందించిన శిర్సత్ మాట మార్చారు. ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే తనతో చెప్పిన విషయాన్నే తాను చెప్పానని పేర్కొన్నారు. శిర్సత్ వ్యాఖ్యలపై ప్రియాంక తీవ్రంగా స్పందించారు. తన ఆత్మను అమ్ముకున్న ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. రాజకీయాలు, మహిళలపై తనకున్న పాడుబుద్ధిని శిర్సత్ బయటపెట్టేసుకున్నారని అన్నారు.

ఆదిత్య థాకరే కూడా శిర్సత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఇంత కుళ్లిన మనస్తత్వం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో ఎలా నిలదొక్కుకున్నారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్‌ను వీడిన ప్రియాంక  2019లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన పార్టీలో చేరారు.
Priyanka Chaturvedi
Sanjay Shirsat
Shiv Sena
Aaditya Thackeray

More Telugu News