నెల్లూరులో ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం
- ట్రాక్ మధ్యలో రెండు మీటర్ల పొడవైన రైలు పట్టా
- దానిని ఢీ కొట్టిన నర్సాపురం - ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలు
- ఎగిరి దూరంగా పడిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఆదివారం తెల్లవారుజామున కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్యలో ముసునూరు వద్ద రైల్వే ట్రాక్ పై దుండగులు రైలు పట్టాను పెట్టారు. దాదాపు రెండు మీటర్ల పొడవైన రైలు పట్టాను ట్రాక్ కు అడ్డంగా పెట్టారు. అదే ట్రాక్ పై నర్సాపూర్ - ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చింది. రైలు, పట్టాను ఢీ కొట్టగా.. ఆ వేగానికి రైలు పట్టా దూరంగా ఎగిరిపడింది. ఇలా ఎగిరి పక్కన పడడం వల్లే ప్రమాదం తప్పిందని, లేదంటే పెను ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పట్టాను ట్రాక్ పై పెట్టిన దుండగులను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని వివరించారు.