PSLV C56: పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతం.. 7 సింగపూర్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో

ISRO successfully launched PSLV C56 and placed  7 Singapore satellites in orbit
  • ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగం
  • ఇస్రోకు ఇది 90వ స్పేస్ మిషన్
  • పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 58వ మిషన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరోసారి సత్తా చాటింది. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 90వ స్పేస్ మిషన్ కావడం గమనార్హం. ఈ ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీని ప్రయోగించారు. షార్ లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగాన్ని చేపట్టారు. పీఎస్ఎల్వీ వాహక నౌకకు సంబంధించి ఈ ఏడాది ఇది రెండో ప్రయోగం కాగా... మొత్తం మీద పీఎస్ఎల్వీ సిరీస్ లో 58వ మిషన్ కావడం గమనార్హం.

ప్రయోగం విజయవంతమయిన తర్వాత శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రయోగం విజయవంతం అయిందని, రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించామని చెప్పారు. సెప్టెంబర్ లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. అది కూడా పూర్తిగా కమర్షియల్ మిషన్ అని చెప్పారు.
PSLV C56
ISRO

More Telugu News