World Cup: భారత్ లో వన్డే వరల్డ్ కప్... టికెట్ల విక్రయాలకు ముహూర్తం ఖరారు!

Ticket sales for ODI World Cup will be started in next month
  • నాలుగేళ్లకోసారి వన్డే వరల్డ్ కప్
  • ఈసారి మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్
  • అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వరల్డ్ కప్
  • ఆగస్టు 10 నుంచి టికెట్ల విక్రయాలు 
నాలుగేళ్లకోసారి జరిగే వన్డే వరల్డ్ కప్ కు ఈసారి భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 5న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ నవంబరు 19న ముగియనుంది. అయితే, ఈ మెగా ఈవెంట్ కు టికెట్ల అమ్మకాలపై బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 10 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ ల టికెట్ల విక్రయాలు జరపాలని బోర్డు భావిస్తోంది. 

బీసీసీఐ కార్యదర్శి జై షా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరిగే రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో సమావేశం జరిపారు. ఈసారి ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు జరపరాదని ఈ సమావేశంలో నిర్ణయించారు. అభిమానులు తప్పనిసరిగా టికెట్ కౌంటర్లకు వచ్చి టికెట్లు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. అందుకోసం ఏడెనిమిది వికెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే టికెట్ల ధరలపై ప్రకటన ఉంటుందని షా వెల్లడించారు.
World Cup
Tickets
Sales
BCCI
India

More Telugu News