ai: మోదీ, సోనియా, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు బార్బీ మేకోవర్ ఇచ్చిన AI ఆర్టిస్ట్

AI Artist Gives Barbie Makeover To Politicians Check The Beautiful Results
  • ఏఐని పొలిటికల్ యాంగిల్‌కు మిక్స్ చేసిన ఏఐ ఆర్టిస్ట్
  • పదిమంది నేతలకు బార్బీ మేకోవర్‌తో సినిమాటిక్ లుక్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బార్బీ మేకోవర్ చిత్రాలు
ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ చిత్రం బార్బీ ఫీవర్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐని పొలిటికల్ యాంగిల్‌కు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఓ ఔత్సాహికుడికి వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా మన దేశ రాజకీయ నాయకులకు ఏఐతో బార్బీ మేకోవర్ ఇచ్చాడు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లకు సినిమాటిక్ లుక్ ఇచ్చారు.

బార్బీ మేకప్, సరికొత్త హెయిల్ స్టైల్ తో గులాబీ రంగు దుస్తుల్లో తీర్చిదిద్దారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నాయకుల ట్రెండీ లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ పోస్టుకు వేలాది లైక్స్ వచ్చాయి. ఈ ఏఐ బార్బీ ఫోటోలపై దాదాపు అందరు నెటిజన్లు సానుకూలంగా కామెంట్లు పెడుతున్నారు.
ai
barbie
Narendra Modi
Sonia Gandhi

More Telugu News