Munneru: విజయవాడ-హైదరాబాద్ మధ్య తగ్గిన మున్నేరు ఉద్ధృతి... మొదలైన రాకపోకలు

  • ఏపీలో భారీ వర్షాలు
  • ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు వాగు ఉద్ధృతం
  • ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి వరద
  • గురువారం సాయంత్రం నుంచి నిలిచిన రాకపోకలు
  • తాజాగా రాకపోకల పునరుద్ధరణ
Vehicles moves as Munneru slow down at Aitavaram on Vijayawada and Hyderabad highway

భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడం తెలిసిందే. దాంతో, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 

ఐతవరం వద్ద మున్నేరు ఉప్పొంగడంతో రహదారిపై వరద నీరు ప్రవహించింది. దాంతో పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇప్పుడు ఐతవరం వద్ద మున్నేరు ప్రవాహ తీవ్రత తగ్గడంతో తాజాగా, ఆ మార్గంలో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసులు దగ్గరుండి వాహనాలను ముందుకు పంపిస్తున్నారు.

నిన్న సాయంత్రం నుంచి ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడం తెలిసిందే. గత 24 గంటలుగా వాహనాలను పోలీసులు నందిగామ నుంచి మధిర మీదుగా విజయవాడకు మళ్లించారు.

More Telugu News