Supreme Court: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు

Supreme Court consider MLC Kavitha Petition
  • మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడాన్ని కోర్టులో సవాల్ చేసిన కవిత
  • ఆరువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు
  • కవిత తరఫున కపిల్ సిబాల్, ముకుల్ రోహిత్గీ వాదనలు

మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం... దానిపై విచారణ జరపాలని నిర్ణయించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది.

మహిళలను దర్యాఫ్తు సంస్థల ఆఫీసుల్లో ఎలా విచారిస్తారని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వోకేట్ జనరల్ జె.రామచంద్రరావు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను దర్యాఫ్తు సంస్థలు విచారించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News