Crypto Billionaire: సూట్ కేసులో ముక్కలుముక్కలుగా.. క్రిప్టో కరెన్సీ బిలియనీర్!

Crypto billionaire chopped in Argentina
  • అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో దారుణం
  • క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్, బిలియనీర్ ఫెర్నాండో దారుణ హత్య
  • శరీరాన్ని ముక్కలు చేసే ముందు తుపాకీతో కాల్చిన వైనం

అర్జెంటీనాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లెయెన్సర్, బిలియనీర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా దారుణ హత్యకు గురయ్యాడు. వారం రోజులుగా ఆయన కనిపించకుండా పోయారు. చివరకు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని ఒక కాలువ పక్కన విగత జీవిగా కనిపించాడు. ఒక సూట్ కేసులో ముక్కలుముక్కలుగా చేయబడిన ఆయన శరీర భాగాలను గుర్తించారు. కొంతమంది పిల్లలు ఆడుకుంటుండగా వారికి రెడ్ కలర్ సూట్ కేస్ కనిపించింది. ఈ విషయాన్ని వారు వారి తల్లిదండ్రులకు తెలిపారు. వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.   

పోలీసులు సూట్ కేస్ ను తెలిచి చూడగా అందులో ఫెర్నాండో కాళ్లు, ఒక చేయి, కొన్ని భాగాలు కనిపించాయి. మరో చేయిని కాలువ సమీపంలో పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అతని తల, ఇతర భాగాలను కూడా గుర్తించారు. శరీర భాగాలను అటాప్సీకి పంపించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. ఒక ప్రొఫెషనల్ ఆయన శరీరాన్ని ముక్కలు చేశాడని తేలింది. అంతేకాదు, ఆయన శరీరాన్ని ముక్కలుగా నరికే ముందు మూడు సార్లు ఆయనను తుపాకీతో కాల్చారు. ఫింగర్ ప్రింట్స్, శరీరంపై ఉన్న టాటూల ఆధారంగా అధి ఫెర్నాండో డెడ్ బాడీ అని నిర్ధారించారు.

  • Loading...

More Telugu News