ఏపీ, ఒడిశా తీరంలో డాల్ఫిన్లు.. తిమింగలాలు
- ఇండియన్ ఎకనమిక్ జోన్ పరిధిలో ఎఫ్ఎస్ఐ సర్వే
- 10,416 డాల్ఫిన్లు, 27 తిమింగలాల గుర్తింపు
- మచిలీపట్టణం, కాకినాడ, బారువా తీరాల్లో సంచరిస్తున్న క్షీరదాలు
డాల్ఫిన్లలో 16 రకాలు ఉండగా తూర్పు తీరంలో ఆరు రకాలు సంచరిస్తున్నాయి. పాంట్రాపికల్ స్పాడెట్ రకానికి చెందిన దాదాపు 700 డాల్పిన్లు మచిలీపట్టణం, కాకినాడ పరిసరాల్లో గుర్తించారు. స్పిన్నర్ రకానికి చెందిన 700 డాల్ఫిన్లను కాకినాడ, బారువా, గోపాల్‌పూర్ ప్రాంతాల్లో గుర్తించారు. రిస్సో రకానికి చెందిన 150 డాల్ఫిన్లను పారాదీప్ ప్రాంతంలో కనుగొన్నారు. డాల్ఫిన్ల సర్వే కోసం విశాఖ అధికారులు ‘మత్స్యదర్శిని’ నౌకను ఉపయోగించారు.